
అక్టోబర్ 17 వరకు ఎల్‌ఐసీ క్యాంపెయిన్
ప్రీమియంలను చెల్లించకుండా నిలిపివేసిన (ల్యాప్స్‌డ్) పాలసీలను పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇది ఆగస్టు 18న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు ఉంటుంది. దీని కింద ఆలస్య రుసుములపై మినహాయింపులు కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
నాన్–లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై ఇది 30 శాతం వరకు ఉంటుంది. గరిష్టంగా రూ.5,000 వరకు మినహాయింపు పొందవచ్చు. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపై లేట్ ఫీజులపై 100 శాతం మినహాయింపు ఉంటుంది. స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ కింద తొలిసారిగా ప్రీమియంను నిలిపివేసిన తేదీ నుంచి అయిదేళ్ల లోపు వ్యవధి వరకు పాలసీలను, నిర్దిష్ట షరతులకు లోబడి పునరుద్ధరించుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించక ప్రీమియంలను సకాలంలో చెల్లించలేకపోయిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఇంటెల్ రహస్య పత్రాలు దొంగలించి మైక్రోసాఫ్ట్‌లో..