అమీర్ ఖాన్ మాస్టర్‌ ప్లాన్‌.. రూ. 500 కోట్లు టార్గెట్‌! | Sakshi
Sakshi News home page

అమీర్ ఖాన్ మాస్టర్‌ ప్లాన్‌.. రూ. 500 కోట్లు టార్గెట్‌!

Published Sat, Dec 30 2023 6:59 PM

Man Infra to redevelop Aamir Khan property - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో, మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌గా పిలిచే అమీర్ ఖాన్ (Bollywood hero Aamir Khan) మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ముంబైలో తనకు చెందిన ఓ ప్రాపర్టీని రీడెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. దీని టార్గెట్‌ రూ. 500 కోట్లు అని తెలుస్తోంది.

ముంబైలో అమీర్ ఖాన్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ రీడెవలప్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు ప్రాపర్టీ డెవలపర్ మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ (MICL) తాజాగా తెలిపింది. ఈ ఆస్తి ముంబైలోని బాంద్రా (పశ్చిమ) ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న విర్గో కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందినది. ఇందులో 24 ఫ్లాట్‌లు ఉన్నాయి. వీటిలో అమిర్‌ ఖాన్‌కు తొమ్మిది ఫ్లాట్‌లు ఉన్నాయి.

రూ. 500 కోట్లు టార్గెట్‌
అమీర్ ఖాన్ ప్రాపర్టీ రీడెవలప్‌మెంట్‌ ఒప్పందం నిబంధనలను మాత్రం మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ వెల్లడించలేదు. ప్రాపర్టీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రూ. 500 కోట్ల టాప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ప్రాజెక్ట్‌లో లగ్జరీ 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 2024 మధ్యలో ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement