ఐపీవోకు కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌  | Magnet winding wires maker KSH International plans Rs 745-crore IPO | Sakshi
Sakshi News home page

ఐపీవోకు కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ 

May 25 2025 5:08 AM | Updated on May 25 2025 5:08 AM

Magnet winding wires maker KSH International plans Rs 745-crore IPO

రూ.745 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం  

ముంబై: మాగ్నెట్‌ వైండింగ్‌ వైర్స్‌ తయారీ సంస్థ కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఐపీఓ ద్వారా రూ.745 కోట్ల సమీకరణకు సిద్ధమైంది. ఇందుకు అనుమతులు కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచింది. కంపెనీ ఆఫర్‌లో భాగంగా రూ.420 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్లు రూ.325 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. 

ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.226 కోట్లు రుణ చెల్లింపులకు, కొత్త యంత్రాల కొనుగోలుకు రూ.90.06 కోట్లు, రూఫ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.10.41 కోట్లు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇష్యూకు నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా, ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైం ఇండియా సంస్థ రిజి్రస్టార్‌గా వ్యవహరించనున్నాయి.  

మే 27న నికితా పేపర్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.95–104  క్రాఫ్ట్‌ పేపర్‌ తయారీ సంస్థ నికితా పేపర్స్‌ ప్రతిపాదిత ఐపీఓ మే 27న ప్రారంభమై 29న ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.95–104గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర (రూ.104) వద్ద రూ.67.5 కోట్లు సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది.

 ఐపీఓలో భాగంగా 64.94 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. పబ్లిక్‌ ఇష్యూ పూర్తయిన తర్వాత కంపెనీ షేర్లు ‘ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ఎమర్జ్‌’లో లిస్ట్‌ కానున్నాయి. ఐపీవో ద్వారా వచ్చే మొత్తాన్ని కొత్త ప్లాంట్‌ నిర్మాణానికి, కంపెనీ ఇతర కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఫాస్ట్‌ ట్రాక్‌ ఫిన్‌సెక్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా, స్కైలైన్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ సంస్థ రిజి్రస్టార్‌గా వ్యవహరించున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement