ఈ వారంలో రెండు ఐపీఓలు | Laser Power and Infra IPO will open for subscription on July 9 | Sakshi
Sakshi News home page

ఈ వారంలో రెండు ఐపీఓలు

Jul 6 2026 5:11 AM | Updated on Jul 6 2026 5:11 AM

Laser Power and Infra IPO will open for subscription on July 9

నేటి నుంచే ‘కుసుమ్‌గర్‌’ ఆఫర్‌ ప్రారంభం 

జూలై 9న ‘లేజర్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా’ పబ్లిక్‌ ఇష్యూ  

దేశీయ ప్రైమరీ మార్కెట్‌ ఈ వారం మరింత జోరందుకోనుంది. రెండు ప్రముఖ సంస్థలు తమ ఐపీఓలతో ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి. రూ. 650 కోట్లతో కుసుమ్‌గర్‌ ఇంజనీరింగ్‌ ఫ్యాబ్రిక్స్‌ తయారీ సంస్థ ‘కుసుమ్‌గర్‌ లిమిటెడ్‌’ పబ్లిక్‌ ఇష్యూ జూలై 8న (సోమవారం) ప్రారంభమై, జూలై 10న ముగుస్తుంది. ఈ ఐపీఓ కోసం ధర శ్రేణిని రూ. 398 – రూ. 419 గా నిర్ణయించారు. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో వస్తున్న ఈ ఇష్యూ ద్వారా ప్రమోటర్లు రూ. 650 కోట్లను సమీకరించనున్నారు. 

రూ. 742 కోట్లతో లేజర్‌ పవర్‌
విద్యుత్‌ కేబుళ్లు, కండక్టర్ల తయారీ సంస్థ ‘లేజర్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌’ పబ్లిక్‌ ఇష్యూ జూలై 9న (మంగళవారం) ప్రారంభమై, జూలై 13న ముగుస్తుంది. మొత్తం రూ. 742 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఇష్యూలో రూ. 542 కోట్ల విలువైన తాజా షేర్లు ఉన్నాయి. మిగిలిన రూ. 200 కోట్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తారు. ఈ తాజా షేర్ల ద్వారా వచ్చే నిధులను కంపెనీ ప్రధానంగా అప్పుల చెల్లింపుల (రూ. 490 కోట్లు) కోసం, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 

రూ. 5,000 కోట్లతో క్యూబ్‌ హైవేస్‌
దేశవ్యాప్తంగా భారీగా హైవే ఆస్తులు కలిగిన ‘క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌’  కూడా ఈ నెలలోనే మెగా పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధమవుతోంది. దాదాపు రూ. 5,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా రానున్న ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉండనుంది. దీనిద్వారా తమ ఇన్వెస్టర్ల పరిధిని విస్తరించుకోవడంతో పాటు మార్కెట్లో లిక్విడిటీని (నగదు లభ్యత) మెరుగుపరుచుకోవాలని సంస్థ భావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement