ఏఐతో రియల్‌ ఎస్టేట్‌ సేవలు.. | Magicbricks Enhances READPRO CRM for 95000 Active Brokers | Sakshi
Sakshi News home page

ఏఐతో రియల్‌ ఎస్టేట్‌ సేవలు..

Jan 31 2025 8:19 PM | Updated on Jan 31 2025 8:26 PM

Magicbricks Enhances READPRO CRM for 95000 Active Brokers

దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్‌లైన్‌ టూల్స్‌ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరో

ఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్‌ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్‌ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్‌ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్‌ బ్రిక్స్‌ సీఈఓ సుధీర్‌ పాయ్‌ తెలిపారు.  

దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో.. 
దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్‌వర్క్‌తో, కన్సల్టెంట్లకు సీఆర్‌ఎమ్‌ పరిష్కారంగా ‘రీడ్‌ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్‌ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్‌ఎమ్‌ వేదికగా ఈ ‘రీడ్‌ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్‌ బ్రోకర్‌ లైసెన్స్‌లను సాధించింది. రియల్‌–టైమ్‌ సేల్స్‌ ట్రాకింగ్, లీడ్‌ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్‌ అనలిటిక్స్‌ వంటి ఫీచర్లతో ఈ రీడ్‌ ప్రో డేటా, లీడ్‌ మేనేజ్‌మెంట్, లైవ్‌ టీమ్‌ అప్‌డేట్‌లు, రియల్‌–టైమ్‌ పెర్ఫార్మెన్స్‌ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్‌ డాష్‌బోర్డ్‌లు, కంపాస్‌ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్‌ జనరేషన్‌లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.

రెండు కోట్ల కస్టమర్లకు.. 
ఈ ఆస్తి పోర్టల్‌లో వెరిఫైడ్‌ లీడ్స్, సైట్‌ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్‌లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్‌ బ్రిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్‌ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్‌ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్‌ సేథ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement