breaking news
Crm Intelligence
-
ఏఐతో రియల్ ఎస్టేట్ సేవలు..
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్లైన్ టూల్స్‌ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరోఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్‌ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్‌వర్క్‌తో, కన్సల్టెంట్లకు సీఆర్ఎమ్ పరిష్కారంగా ‘రీడ్ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్ఎమ్ వేదికగా ఈ ‘రీడ్ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్ బ్రోకర్ లైసెన్స్‌లను సాధించింది. రియల్–టైమ్ సేల్స్ ట్రాకింగ్, లీడ్ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ వంటి ఫీచర్లతో ఈ రీడ్ ప్రో డేటా, లీడ్ మేనేజ్మెంట్, లైవ్ టీమ్ అప్డేట్లు, రియల్–టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్‌లు, కంపాస్ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్ జనరేషన్లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.రెండు కోట్ల కస్టమర్లకు.. ఈ ఆస్తి పోర్టల్‌లో వెరిఫైడ్ లీడ్స్, సైట్ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్ బ్రిక్స్ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్ సేథ్ పేర్కొన్నారు. -
రూ.120 కోట్లతో ఇన్‌సైడ్‌వ్యూ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ సర్వీస్‌లను అందించే అమెరికాకు చెందిన ఇన్‌సైడ్‌వ్యూ దేశీయంగా విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్ళలో రూ.120 కోట్లతో విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఇన్‌సైడ్‌వ్యూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జిమ్ లైట్సే తెలిపారు. ఆరేళ్ళ క్రితం హైదరాబాద్‌లో డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పుడది 17,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 90 మంది ఉద్యోగులను కలిగి ఉంది. మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో జిమ్ మాట్లాడుతూ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) ఇంటిలిజెన్స్ ప్రోడక్టుపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా కంపెనీలు తక్కువ వ్యయంతో మరింత సమర్థవంతంగా అమ్మకాలను, అకౌంటింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇందుకోసం నెలకు 80 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సీఆర్ఎం ఇంటిలిజెన్స్‌కు అంతర్జాతీయంగా 1200 మంది ఖాతాదారులు ఉండగా, రెండు లక్షల మంది వినియోగిస్తున్నారు. 2015 నాటికి ఇండియాలోకి అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు.