రూ.120 కోట్లతో ఇన్‌సైడ్‌వ్యూ విస్తరణ | InsideView to invest $20 mn in India operations | Sakshi
Sakshi News home page

రూ.120 కోట్లతో ఇన్‌సైడ్‌వ్యూ విస్తరణ

Oct 30 2013 2:15 AM | Updated on Sep 2 2017 12:06 AM

సాఫ్ట్‌వేర్ సర్వీస్‌లను అందించే అమెరికాకు చెందిన ఇన్‌సైడ్‌వ్యూ దేశీయంగా విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ సర్వీస్‌లను అందించే అమెరికాకు చెందిన ఇన్‌సైడ్‌వ్యూ దేశీయంగా విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్ళలో రూ.120 కోట్లతో విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఇన్‌సైడ్‌వ్యూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జిమ్ లైట్‌సే తెలిపారు.  ఆరేళ్ళ క్రితం హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పుడది  17,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 90 మంది ఉద్యోగులను కలిగి ఉంది.  
 
 మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో జిమ్ మాట్లాడుతూ కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం) ఇంటిలిజెన్స్ ప్రోడక్టుపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా కంపెనీలు తక్కువ వ్యయంతో మరింత సమర్థవంతంగా అమ్మకాలను, అకౌంటింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇందుకోసం నెలకు 80 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సీఆర్‌ఎం ఇంటిలిజెన్స్‌కు అంతర్జాతీయంగా 1200 మంది ఖాతాదారులు ఉండగా, రెండు లక్షల మంది వినియోగిస్తున్నారు. 2015 నాటికి ఇండియాలోకి అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement