లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ వజ్రోత్సవం | Lufthansa Celebrates 60 Years of Germany-India Flights | Sakshi
Sakshi News home page

లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ వజ్రోత్సవం

Sep 4 2023 6:39 AM | Updated on Sep 4 2023 6:39 AM

Lufthansa Celebrates 60 Years of Germany-India Flights - Sakshi

న్యూఢిల్లీ: లుఫ్తాన్సా జర్మన్‌ ఎయిర్‌లైన్స్‌ ఢిల్లీకి ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయింది. ఈ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఢిల్లీలోని తాజ్‌ మహల్‌ హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. 

లుఫ్తాన్సా గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాంక్‌ నేవ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీకి ఏ380 ఫస్ట్‌క్లాస్‌ సరీ్వసును తిరిగి అందిస్తున్నట్టు ప్రకటించారు. 1963 సెపె్టంబర్‌ 1న బోయింగ్‌ 720 సరీ్వస్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి ఢిల్లీకి ఈ సంస్థ ప్రారంభించడం గమనార్హం. భారత వృద్ధి పథాన్ని ముందే నమ్మిన వారిలో తామూ కూడా ఒకరమంటూ, మరో 60 ఏళ్లపాటు భారత్‌తో బలమైన అనుబంధానికి కట్టుబడి ఉన్నామని లుఫ్తాన్సా గ్రూప్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement