ఈ టిప్స్ పాటిస్తే.. మంచి జాబ్ పక్కా!! | LinkedIn Tips to Help Professionals Avoid Job Scams | Sakshi
Sakshi News home page

ఈ టిప్స్ పాటిస్తే.. మంచి జాబ్ పక్కా!!

Feb 11 2025 7:07 PM | Updated on Feb 11 2025 8:29 PM

LinkedIn Tips to Help Professionals Avoid Job Scams

ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారిలో 82 శాతం లేదా 10 మందిలో 8 మంది ఆన్‌లైన్‌(లింక్డ్ఇన్)లో వెతుకుతున్నారు. స్కామర్లు, సైబర్ నేరగాళ్లు పెరిగిపోయిన తరుణంలో ఫేక్ రిక్రూటర్లు తయారవుతున్నారు. ఉద్యోగార్థులు తప్పుదోవపట్టిస్తున్నారు. కొందరు డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో ఆన్‌లైన్ జాబ్ సెర్చింగ్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం.

జాబ్ సెర్చింగ్‌లో ఉద్యోగార్థులు సురక్షితంగా ఉండటానికి, వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని 'సేఫర్ ఇంటర్నెట్ డే' (Safer Internet Day) సందర్భంగా.. లింక్డ్ఇన్ (LinkedIn) ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' (Aditi Jha) పేర్కొన్నారు. జాబ్ పోస్టింగ్‌లను జాగ్రత్తగా సంప్రదించడం, అప్లై చేసుకునే ముందు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం తెలుసుకోవడం ముఖ్యని అన్నారు.

సేఫ్ జాబ్ సెర్చింగ్‌ కోసం టిప్స్

  • మీరు ఎలాంటి వివరాలను పంచుకుంటున్నారో చూసుకోండి. ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు ముందు బ్యాంక్ వివరాలను ఇవ్వకండి.

  • అనుమానాస్పదమైన అభ్యర్థనలకు నో చెప్పండి. ఇంటర్వ్యూ కోసం ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయమని అడగడం, ఎక్కువ జీతం.. తక్కువ పని వంటి ఆఫర్స్ ఇవ్వడం వంటి వాటిపై జాగ్రత్త వహించండి.

  • ఉద్యోగం కోసం ముందుగానే డబ్బు చెల్లించాలి అని చెప్పే.. పోస్టింగుల పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు పంపమని, క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడిగే వారికి స్పందించకపోవడం ఉత్తమం.

  • మీ సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. మీ ఖాతాకు అదనపు ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను యాడ్ చేయడం వల్ల.. మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయిన సమయంలో ఇవి ఉపయోగపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement