ఆర్థిక భద్రత నుంచి ఆరోగ్య రక్షణ దాకా.. ఎల్‌ఐసీ కొత్త పథకాలు | LIC Launches New Schemes New Jeevan Dhara Health Shield Cancer Cover | Sakshi
Sakshi News home page

ఆర్థిక భద్రత నుంచి ఆరోగ్య రక్షణ దాకా.. ఎల్‌ఐసీ కొత్త పథకాలు

Oct 14 2026 2:59 PM | Updated on Oct 14 2026 3:05 PM

LIC Launches New Schemes New Jeevan Dhara Health Shield Cancer Cover

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి మూడు కొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న వైద్య ఖర్చులకు అనుగుణంగా న్యూ జీవన్‌ ధార, హెల్త్‌ షీల్డ్‌, క్యాన్సర్‌ కవర్‌ పేరిట ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

కొత్త ప్లాన్ల వివరాలు

న్యూ జీవన్‌ ధార: ఇది ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, యాన్యుటీ (రిటైర్‌మెంట్) ప్లాన్. ఉద్యోగ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో పాలసీదారులు తమ అవసరాలకు తగినట్లుగా సింగిల్ లేదా రెగ్యులర్ ప్రిమియం చెల్లింపు పద్ధతులను ఎంచుకోవచ్చు. వాయిదా వేసిన యాన్యుటీ కాలపరిమితిలో కూడా ఆర్థిక భద్రత లభించడం దీని ప్రత్యేకత.

హెల్త్‌ షీల్డ్‌: మొత్తం కుటుంబానికి ఆరోగ్య రక్షణ అందించడమే లక్ష్యంగా ఈ సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రూపొందించారు. ఆసుపత్రి వైద్య ఖర్చులు, తీవ్ర అనారోగ్యాలు, అత్యవసర చికిత్సలకు ఈ పథకం కింద పూర్తిస్థాయి ఆర్థిక కవరేజీ లభిస్తుంది. నాణ్యమైన వైద్యం అందించడంలో కుటుంబాలకు ఇది కొండంత అండగా నిలుస్తుంది.

క్యాన్సర్‌ కవర్‌: క్యాన్సర్ వంటి మహమ్మారి బారిన పడినప్పుడు అయ్యే వాస్తవ చికిత్స వ్యయాలతో సంబంధం లేకుండా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత ఆర్థిక ప్రయోజనాన్ని అందించే ప్రత్యేక ప్లాన్ ఇది. ఈ పథకం కింద ప్రీమియం మినహాయింపు, ముందస్తు క్యాన్సర్ దశల్లోనూ ఆర్థిక సాయం, అలాగే క్రమబద్ధమైన ఆదాయ ప్రయోజనాలు అందుతాయి.

మారుతున్న సమాజంలో పదవీ విరమణ అనంతరం ఆర్థిక స్వతంత్రతతో పాటు నాణ్యమైన వైద్య సంరక్షణ అత్యవసరంగా మారాయి. ఈ మూడు ప్లాన్లు రిటైర్మెంట్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్స్, క్యాన్సర్‌ డిసీజ్ కవరేజీలు అందిస్తున్నాయని కంపెనీ చెప్పింది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతల నిబంధనల కోసం వినియోగదారులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను గానీ, సమీప శాఖను గానీ సంప్రదించవచ్చు.

ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్‌.. ఇదే మంచి ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement