2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌!

Kia to open bookings for the 2023 Kia EV6 on 15 April 2023 - Sakshi

సాక్షి,ముంబై:  కియా కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.  కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనం ఈవీ 6  2023 వెర్షన్ బుకింగ్‌లను షురూ చేస్తోంది.   ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు  కంపెనీ బుధవారం ప్రకటించింది.

2023 ఈవీ6 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.  జీటీ లైన్ , జీటీ GT లైన్ AWD. వీటి ధరలు  వరుసగా రూ. 60.95 లక్షలు, రూ. వరుసగా 65.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్‌!)

గత ఏడాది తమ పాపులర్‌ కారును అందుకోలోలేకపోయిన వారి కోసం తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించామనీ, మార్కెట్‌లో అద్భుతమైన పనితీరుతో ఈవీ6 ప్రీమియం ఈవీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతుందనే విశ్వసాన్ని కియా ఇండియా సీఎండీ తే జిన్‌ పార్క్‌ ప్రకటించారు. 2022లో 432 యూనిట్ల  విక్రయించిన కంపెనీ, 150 kW హై-స్పీడ్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం ఉన్న 15 డీలర్‌షిప్‌ల నుండి మొత్తం 60 అవుట్‌లెట్‌లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. (2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్‌, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top