కెన్‌స్టార్‌ నుంచి నూతన ఉత్పత్తులు | Kenstar Forays Into Large Appliances | Sakshi
Sakshi News home page

కెన్‌స్టార్‌ నుంచి నూతన ఉత్పత్తులు

Jul 15 2024 6:16 AM | Updated on Jul 15 2024 9:12 AM

Kenstar Forays Into Large Appliances

హైదరాబాద్‌: ప్రముఖ గృహోపకరణాల సంస్థ కెన్‌స్టార్‌.. పెద్ద సైజు హోమ్‌ అప్లయన్సెస్‌ను విడుదల చేసింది. వీటిల్లో డబుల్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్లు, స్లి్పట్‌ ఎయిర్‌ కండీషనర్లు, ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషిన్లు ఉన్నాయి. వీటి ఆవిష్కరణతో అన్ని రకాల గృహోపకరణాలు అందిస్తున్న కంపెనీగా మారింది.

 ప్రధాన విభాగాలైన ఎయిర్‌ కూలర్లు, చిన్నపాటి గృహోపకరణాలు, వాటర్‌ హీటర్లపైనా తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది. కూలర్ల విభాగంలో నంబర్‌ 1 కంపెనీగా అవతరిస్తామని పేర్కొంది. 2023–24 సంవత్సరంలో కంపెనీకి మైలురాయి అని, 55 శాతం వృద్ధిని సాధించినట్టు కెన్‌స్టార్‌ సీఈవో సునీల్‌ జైన్‌ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement