మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు | 2024 Kawasaki New Bike Z900 Launched In India, Check Indian Price Details And Its Special Features - Sakshi
Sakshi News home page

2024 Kawasaki Z900 Launch: మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు

Published Thu, Feb 22 2024 2:17 PM

Kawasaki New Bike Z900 launched - Sakshi

కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది.

కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.

ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్‌ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది.

జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్‌లు, మూడు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Advertisement
 
Advertisement