తెలంగాణలో కామధేను విస్తరణ | Kamdhenu strengthens presence in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కామధేను విస్తరణ

Jul 20 2023 6:13 AM | Updated on Jul 20 2023 6:13 AM

Kamdhenu strengthens presence in Telangana - Sakshi

హైదరాబాద్‌: బ్రాండెడ్‌ టీఎంటీ కడ్డీల తయారీ, విక్రయ సంస్థ కామధేను లిమిటెడ్‌ .. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఏడాది కాలంలో ప్రీమియం బ్రాండ్‌ ‘కామధేను ఎన్‌ఎక్స్‌టీ’ ఉత్పత్తి సామరŠాధ్యలను 3 లక్షల ఎంటీ (మెట్రిక్‌ టన్నులు) నుంచి 3.6 లక్షల ఎంటీకి పెంచుకోనున్నట్లు వివరించింది.

అలాగే 100కు పైగా డీలర్లు, పంపిణీదారులను కొత్తగా చేర్చుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ సునీల్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో తమకు 350 మంది డీలర్లు, డి్రస్టిబ్యూటర్ల నెట్‌వర్క్‌ ఉందని ఆయన వివరించారు. కామధేను టీఎంటీ బ్రాండ్‌ కడ్డీల టర్నోవరు రూ. 21,000 కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement