విశాఖలో మెరుగైన నెట్‌వర్క్‌గా జియో | Jio network in Vizag leading the pack and TRAI latest Drive Test confirms | Sakshi
Sakshi News home page

విశాఖలో మెరుగైన నెట్‌వర్క్‌గా జియో

Jul 15 2025 5:46 PM | Updated on Jul 15 2025 7:35 PM

Jio network in Vizag leading the pack and TRAI latest Drive Test confirms

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా రిలయన్స్ జియో నిలిచింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను వెనక్కి నెట్టింది. నగరంలో ఇటీవల ట్రాయ్‌ నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (ఐడీటీ)లో  జియో తన  బలమైన మొబైల్ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. మిలియన్ల మంది వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.

ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4జీ నెట్‌వర్క్‌లో 204.91 ఎంబీపీఎస్‌ సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్‌లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్‌లోడ్‌లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.

ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు

మరోవైపు వాయిస్ సేవల్లోనూ జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, జీరో  కాల్ డ్రాప్ రేటుతోపాటు మెరుగైన వాయిస్  స్పష్టత  అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. విశాఖపట్నం అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్‌గా నిలబెట్టాయి. హెచ్‌డీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసినా, హెచ్‌డీ-నాణ్యత వాయిస్ కాల్‌లు చేసినా లేదా రియల్ టైమ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేసినా ఎలాంటి అవాంతరాలు లేవని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement