జియో దూకుడు! ఆ రంగంపై ఫోకస్‌?

JIO ANNOUNCES INVESTMENT OF US 15 MILLION Dollars IN TWO PLATFORMS INC - Sakshi

రిలయన్స్‌ ఆధీనంలోని జియో నెట్‌వర్క్‌ ఫ్యూచర్‌ టెక్నాలజీపై ఫోకస్‌ చేసింది. దేశంలో తనకున్న కస్టమర్‌ బేస్‌కి ఎప్పటికప్పుడు కొత్త సేవలు అందించేందుకు వీలుగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కంపెనీ టూలో 15 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

టూ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెటావర్స్‌, వెబ్‌ 3.0, మెషిన్‌ లెర్నింగ్‌, ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది. ముఖ్యంగా నిర్మాణ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే టెక్నాలజీపై పని చేస్తోంది. దీంతో రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా జియో టూలో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసింది. 

టీ టీమ్‌ పని తీరు పట్ల నమ్మకం, ఎంచుకున్న రంగంలో వారు చేస్తున్న కృషిని చూసి ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్నట్టు జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. జియోతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని. తమ భాగస్వామ్యంలో సరికొత్త ఉత్పత్తులు భవిష్యత్తులో వెలుగు చూస్తాయని టూ సీఈవో ప్రనవ్‌ మిస్త్రీ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top