రూ.10వేలలో మరో కొత్త ఫోన్‌.. అమ్మకాలు ప్రారంభం | iQoo Z10 Lite 5G Goes On Sale In India Launch Offers specifications | Sakshi
Sakshi News home page

రూ.10వేలలో మరో కొత్త ఫోన్‌.. అమ్మకాలు ప్రారంభం

Jun 25 2025 8:53 PM | Updated on Jun 26 2025 7:04 AM

iQoo Z10 Lite 5G Goes On Sale In India Launch Offers specifications

కొత్తగా లాంచ్‌ అయిన ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 రేంజ్‌లోనే ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ వంటి అద్భుత స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ.500 తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లు ఉన్నాయి. 

👉 కొత్త ఫోన్‌.. రూ.25 వేలకే 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే 👈

ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు
ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్‌వోసీని అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ వి5.4, వై-ఫై 5 ఉన్నాయి.

ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లు
ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇతర బ్యాంక్ కార్డులపై రూ .500 తక్షణ తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, జీఎస్టీ బెనిఫిట్స్ కూడా అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయ్యాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement