పాలసీదారుల కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులకు కూడా వర్తించేలా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. దీని పేరు 'మై ఫ్యామిలీ కంప్లీట్'. దీని కింద రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చు.
మూడు నెలలు పైబడిన పెంపుడు పిల్లులు, శునకాలను ఇందులో చేర్చవచ్చు. పాలసీదారులకు (మనుషులకు) ఇన్-పేషంట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంట్ మొదలైన వాటికి కవరేజి ఉంటుంది.
పెంపుడు జంతువులు తప్పిపోయినప్పుడు ప్రకటనలు, పారితోషికాలు ఇవ్వడానికి, పెట్ పేరెంట్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు ఎమర్జెన్సీ పెట్ అకామడేషన్‌కి, బీమా ఉన్న పెంపుడు జంతువు ఏదైనా ప్రాపర్టీని ధ్వంసం చేసినా, మరణం మొదలైన వాటికి కారణంగా నిల్చినా థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ ఉంటుంది.


