మళ్లీ లాభాల్లో ఇండిగో.. క్యూ2లో రూ. 189 కోట్లు

IndiGo parent reports net profit of Rs 189 crore - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్‌ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో రూ. 189 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,583 కోట్ల నికర నష్టం ప్రకటించింది. సామర్థ్యం పెంపు, అధిక ట్రాఫిక్‌ ఇందుకు సహకరించాయి. వెరసి ఇండిగో బ్రాండు సరీ్వసుల కంపెనీ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది.

అయితే ఈ కాలంలో విదేశీ మారక నష్టం రూ. 806 కోట్లను మినహాయించి లాభాలు ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 15,503 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 12,852 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. ఈ క్యూ2లో ప్రయాణికుల సంఖ్య 26.3 మిలియన్ల నుంచి 33.4 మిలియన్లకు ఎగసింది. సెపె్టంబర్‌కల్లా విమానాల సంఖ్య 334కు చేరగా.. రూ. 30,666 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది.
ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు   1% బలపడి రూ. 2,509 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top