భారత్‌లో లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్

Indian First Rolls Royce Spectre Delivery Details - Sakshi

Rolls Royce Spectre Delivery: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో 'స్పెక్టర్' పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారుని భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయకముందే ఫస్ట్ డెలివరీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని.. సంస్థ చెన్నైకి చెందిన భాష్యం కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన భాష్యం 'యువరాజ్‌'కు డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు రూ. 10 కోట్లు ఖరీదైన ఈ కారుని కొన్న మొదటి భారతీయ కస్టమర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ దాని మునుపటి మోడల్ కార్లకంటే చాలా భిన్నంగా ఉంటుంది. డీఆర్ఎల్‍లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్టైలిష్ ఎల్ఈడీ టైల్‌లైట్స్ వంటి వాటితో పాటు.. షార్ప్ స్లాంటెడ్ రూఫ్ డిజైన్‌ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్‌లో 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 

ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు కొత్త 'స్పిరిట్' సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ 'స్పెక్టర్' నేమ్‌ప్లేట్‌తో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీని చుట్టూ దాదాపు 5,500 స్టార్స్ లాంటి ఇల్యూమినేషన్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!!

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 593 పీఎస్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుమారు 3 టన్నుల బరువున్న ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top