భారత్‌, చైనా మార్కెట్లపై జెఫ్రీస్‌ హెడ్‌ కీలక వ్యాఖ్యలు | indian equity market overweight and china is on underweight said jeffries head | Sakshi
Sakshi News home page

భారత్‌, చైనా మార్కెట్లపై జెఫ్రీస్‌ హెడ్‌ కీలక వ్యాఖ్యలు

Oct 2 2024 7:00 PM | Updated on Oct 2 2024 7:00 PM

indian equity market overweight and china is on underweight said jeffries head

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల జీవితకాల గరిష్ఠాలను చేరిన నేపథ్యంలో ప్రస్తుత స్థాయి నుంచి ఒక శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని జెఫ్రీస్‌ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లు మాత్రం ప్రస్తుత స్థానం నుంచి దాదాపు రెండు శాతం పెరగనున్నాయని అంచనా వేశారు.

క్రిస్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం..భారత ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో చాలామంది మదుపర్లు లాభాలు స్వీకరించే అవకాశం ఉంది. అదే చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి మార్కెట్లు ప్రస్తుత స్థానం నుంచి సుమారు రెండు శాతం పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ వాతావరణం మరింత పెరిగితే భారత్‌తోపాటు దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయి.

ఇదీ చదవండి: పెట్రోల్‌ అప్‌.. డీజిల్‌ డౌన్‌!

దీర్ఘకాల వ్యూహంతో ఈక్విటీలో పెట్టుబడి పెట్టేవారు ప్రతి ప్రతికూల ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. మరో పదేళ్లలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు రానుంది. అన్ని విభాగాలు వృద్ధి చెందనున్నాయి. కాబట్టి మదుపర్లు ట్రేడింగ్‌ కంటే పెట్టుబడిపై దృష్టి సారించి మంచి రాబడులు పొందాలని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement