స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు | India Net Direct Tax Collection Falls 1.3 Percent During April 1-July 10, Check More Details Inside | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు

Jul 12 2025 4:40 AM | Updated on Jul 12 2025 1:44 PM

India net direct tax collection falls 1.3percent during April 1-July 10

జూలై 10 వరకు రూ.5.63 లక్షల కోట్లు 

స్థూల పన్ను వసూళ్లలో 3 శాతం వృద్ధి 

38 శాతం పెరిగిపోయిన రిఫండ్‌లు 

న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 10 వరకు 1.34 శాతం తగ్గి రూ.5.63 లక్షల కోట్ల మేర ఉన్నాయి. రిఫండ్‌లు పెరిగిపోవడమే ఇందుకు కారణం. నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్లు కాగా, నాన్‌ కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. రూ.17,874 కోట్లు సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను రూపంలో వసూలైంది. ఈ మొత్తం కలిపి రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది.

 క్రితం ఏడాది ఇదే కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. నికర రిఫండ్‌లు (పన్ను చెల్లింపుదారులకు చెల్లించింది) 38 శాతం పెరిగి రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లు చెల్లించకముందు చూస్తే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన రూ.6.44 లక్షల కోట్ల కంటే 3.17 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 

కేవలం రిఫండ్‌లు పెరిగిపోవడం నికర ఆదాయం తగ్గడానికి దారితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.25.20 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో కేంద్రం అంచనాలు ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 12.7 శాతం అధికం. ముఖ్యంగా రూ.78,000 కోట్లు సెక్యూరిటీస్‌ లావాదేవీల రూపంలోనే సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement