టెక్‌ మహీంద్రా లాభం అప్‌ | Tech Mahindra net profit for Rs 1,122 crore Q3 FY26 | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రా లాభం అప్‌

Jan 17 2026 4:12 AM | Updated on Jan 17 2026 4:12 AM

Tech Mahindra net profit for Rs 1,122 crore Q3 FY26

క్యూ3లో రూ. 1,122 కోట్లు 

ఆదాయం రూ. 14,393 కోట్లు

ముంబై: ఐటీ సరీ్వసుల దిగ్గజం టెక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం వార్షికంగా 14 శాతం ఎగసి రూ. 1,122 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 983 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లో నమోదైన రూ. 1,194 కోట్లతో పోలిస్తే క్యూ3 నికర లాభం నీరసించింది. 

కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 13,286 కోట్ల నుంచి రూ. 14,393 కోట్లకు బలపడింది. ఈ క్యూ2లో సాధించిన రూ. 13,994 కోట్లతో చూసినా టర్నోవర్‌ పెరిగింది. నిర్వహణ లాభ మార్జిన్లు 2.9 శాతం మెరుగుపడి 13.1 శాతాన్ని తాకాయి. అయితే కొత్త కార్మిక చట్టాల కారణంగా మార్జిన్లపై 0.2 శాతం ప్రతికూల ప్రభావం పడినట్లు కంపెనీ సీఎఫ్‌వో రోహిత్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. 

ఇందుకు 3 కోట్ల డాలర్లు(రూ. 270 కోట్లు) కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కాలంలో కొత్తగా 1.096 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. ఇవి 47 శాతం అధికంకాగా.. 2025 డిసెంబర్‌ 31 కల్లా సిబ్బంది సంఖ్య 872 తగ్గి 1,49,616కు పరిమితమైంది. ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 12.3 శాతంగా నమోదైంది. నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 7,666 కోట్లకు చేరింది. 
ఫలితాల నేపథ్యంలో టెక్‌ ఎం షేరు బీఎస్‌ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 1,671 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement