గరిష్ఠాలను చేరిన ఫారెక్స్‌ నిల్వలు | India forex reserves touched all time high | Sakshi
Sakshi News home page

గరిష్ఠాలను చేరిన ఫారెక్స్‌ నిల్వలు

Sep 13 2024 8:40 PM | Updated on Sep 13 2024 8:40 PM

India forex reserves touched all time high

భారత విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి. ఆగస్టు 30 నాటికి దేశ ఫారెక్స్‌ నిల్వలు 689.24 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.57 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఈ నిల్వలు లెక్కించే ముందు వారంలో ఏకంగా 5.2 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.40 వేలకోట్లు) ఎగసి ఆల్ టైం హైను తాకాయి. ఈమేరకు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించింది.

ఇదీ చదవండి: డైరెక్ట్‌ సెల్లింగ్‌ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు

ఆర్‌బీఐ విడుదల చేసిన ‘వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్’ ప్రకారం..విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 5.10 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.40 వేలకోట్లు) పెరిగి 604.1 బిలియన్ డాలర్ల(రూ.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. బంగారం నిల్వలు 129 మిలియన్ డాలర్లు(రూ.వెయ్యి కోట్లు) పెరిగి 61.98 బిలియన్ డాలర్ల(రూ.4.9 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో నమోదైన దేశాలతో వర్తకం చేసుకునేందుకు వీలుగా ఉంటే స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ వారంలో 4 మిలియన్‌ డాలర్లు(రూ.33 కోట్లు) పెరిగి 18.47 బిలియన్‌ డాలర్లు(రూ.1.4 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో రిజర్వ్ స్థానం 9 మిలియన్‌ డాలర్లు(రూ.75 కోట్లు) పెరిగి 4.63 బిలియన్‌ డాలర్ల(రూ.37 వేలకోట్లు)కు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement