
మే నెలలో 0.39 శాతం
మరింత తగ్గిన ఆహార, ఇంధన ధరలు
ఆహారం, కూరగాయలు, ఇంధన ధరల తగ్గుదలతో టోకు ద్రవ్యోల్బణం మరింత కనిష్టానికి దిగొచ్చింది. మే నెలలో టోకు ధరల ఆధారిత సూచీ 0.39 శాతంగా నమోదైంది. ఇది 14 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు టోకు ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉంటే, గతేడాది మే నెలలో 2.74 శాతంగా ఉంది. ఆహార వస్తువుల విభాగంలో 1.56% ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది.
ఇదీ చదవండి: ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!
ఏప్రిల్ నెలలో ఇది మైనస్ 0.86%గా ఉంది. ముఖ్యంగా కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పుల విభాగంలో ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. కూరగాయల్లో అయితే ఏకంగా మైనస్ 21.6% ద్రవ్యోల్బణం నెలకొంది. ఇంధనం, విద్యుత్ విభాగంలోనూ మైనస్ 2.3% ద్రవ్యోల్బణం నమోదైంది. ఏప్రిల్‌లో ఇదే విభాగంలో 2.18% ద్రవ్యోల్బణం ఉండం గమనార్హం. తయారీ వస్తువుల విభాగంలో 2.04% ద్రవ్యోల్బణం నెలకొంది. మే నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయిలో 2.82 శాతానికి దిగిరావడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్ని విభాగాల్లోనూ కనిపించినట్టు ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు.