బ్యాంకుల్లో నగదు కొరత: నాలుగేళ్ల గరిష్టానికి! | India Banking Liquidity Deficit Jumps to Over 4 Year High | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో నగదు కొరత: నాలుగేళ్ల గరిష్టానికి!

Sep 23 2023 12:12 PM | Updated on Sep 23 2023 12:32 PM

India Banking Liquidity Deficit Jumps to Over 4 Year High - Sakshi

India banking liquidity deficit: దేశీయ బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ కొరతపై రిపోర్ట్‌ ఒకటి ఆందోళన రేపుతోంది. ఈ ఏడాదిలో ఈ నెల (సెప్టెంబరు) 20నాటికి  బ్యాంకింగ్ లిక్విడిటీ లోటు రూ. 1.46 లక్షల కోట్ల వద్ద  నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టులో తొలిసారిగా దేశీయ బ్యాంకుల్లో లిక్విడిటీ లోటులోకి జారుకుంది.

నివేదిక ప్రకారం, ఏప్రిల్ 23, 2019 తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే కొరత. మే 19 , జూలై 28 మధ్య స్వీకరించిన ఇంక్రిమెంటల్‌  డిపాజిట్లలో 10శాతం ఇన్‌క్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ICRR)గా పక్కన పెట్టాలని ఆర్బీఐ ఆదేశించిన తరువాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా బ్యాంకులవద్ద మిగులు నగదు నిల్వ తగ్గింది. అయితే  ముందుస్తు పన్ను చెల్లింపలు, జీఎస్‌టీ చెల్లింపులతో నగదు కొరతకు దారితీశాయనిపేర్కొంది.  (భారత్‌-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్‌ మహీంద్ర సంచలన నిర్ణయం)

ఈ క్రమంలోనే బ్యాంకులు ఎంఎస్‌ఫ్‌ (మార్జినల్‌ స్టాండింగ్‌ సదుపాయం) కింద రికార్డు స్థాయిలో రూ. 1.97 లక్షల కోట్ల రుణాలు, అలాగే  ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం కింద దాదాపు రూ. 46,724 కోట్లను నిలిపివేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.రూ. 2.50 లక్షల కోట్ల వరకు మొత్తం బయటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు తెలిపింది. ఎందుకంటే అదే రిపోర్టింగ్ పక్షం రోజులలో జంట అవుట్‌ఫ్లోలు (ముందస్తు పన్ను చెల్లింపుల , జీఎస్‌టీ ) సంభవించాయని బ్యాంకర్లను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.

రూపాయిపై ఒత్తిడి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులతో వచ్చే ఇబ్బందులను, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ముప్పును తప్పించుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ విధించిన ఇంక్రిమెంటల్‌ క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (ఐసీఆర్‌ఆర్‌) సైతం నగదు లోటుకు దారితీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ ఏడాది ఆగస్టు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకులు తమ ఇంక్రిమెంటల్‌ డిపాజిట్లలో 10 శాతాన్ని పక్కనబెట్టాలని ఆదేశించింది.. కాగా, ఇంచుమించుగా వచ్చే నెల మొదటి వారం వరకు బ్యాంకులు ఇదే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చన్న అంచనాను కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త ఉపాసన భరద్వాజ్‌ వెలిబుచ్చారు.

అంతేకాకుండా, డాలరు మారకంలో  రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగితే,  RBI ద్వారా FX జోక్యంతో మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని ఫస్ట్ బ్యాంక్‌ ఆర్థికవేత్త గౌరా సేన్ గుప్తా రాయిటర్స్‌తో  వ్యాఖ్యానించారు.  ఐసీఆర్‌ఆర్‌తోపాటు, ఆగస్టు నాటి  ద్రవ్యసమీక్షలో  ఆర్‌బీఐ ఐసీసీఆర్‌ను  విధింపుతో   లిక్విడిటీ బిగుతు పెరుగుతోందంటున్నారు 
రూపాయిపై ఒత్తిడి ,అంతర్లీన ద్రవ్యోల్బణ నష్టాలను కూడా నిరోధించవచ్చని, స్వల్పకాలిక రేట్లను పెంచడానికి  బదులుగా ఆర్‌బీఐ RBI సమీప కాలంలో ద్రవ్యతను కఠినంగా ఉంచుతుందని భావిస్తున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్నా భరద్వాజ్. ఈ నెలాఖరు నాటికి ద్రవ్యలోటు తగ్గుతుందని ఆమె తెలిపారు.

లిక్విడిటీ లోటు అంటే 
సరళంగా చెప్పాలంటే, లిక్విడిటీ అంటే ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది లేదా ఎంత త్వరగా నగదును పొందగలరు అనేది. ఉదాహరణకు, సేవింగ్స్ ఖాతా కంటే ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది.  అదే సేవింగ్స్ ఖాతా నుంచి అయితే మనకు అవసరమైనప్పుడు నగదు తీసుకోవచ్చు.బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ అంటే బ్యాంకుల స్వల్పకాలిక వ్యాపారం, ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది అనేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement