పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం | Sakshi
Sakshi News home page

పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం

Published Sat, Feb 24 2024 6:31 AM

Increasing awareness of insurance among urban people - Sakshi

న్యూఢిల్లీ: పట్టణ ప్రజల్లో జీవిత బీమా పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి జీవిత బీమా రక్షణ ఉన్నట్టు మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా ప్రొటెక్షన్‌ క్వొటెంట్‌ (ఐపీక్యూ) 6.0లో ద ప్రొటెక్షన్‌ ఇండెక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 45కి చేరుకుందని, ఇది ఐపీక్యూ 5.0లో 43గానే ఉందని తెలిపింది.

ప్రజల్లో రక్షణ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఐదేళ్ల ఇండియా ప్రొటెక్షన్‌ క్వొటెంట్‌ను పరిశీలించి చూస్తే ఐపీక్యూ 1.0లో 35 నుంచి ఐపీక్యూ 6.0లో 45కు చేరుకుందని, పది పాయింట్లు పెరిగినట్టు వివరించింది.

ఆర్థిక సామర్థ్యాలను నిర్మించుకునే దిశగా పట్టణ ప్రజల ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రొటెక్షన్‌ క్వొటెంట్‌ 49 పాయింట్లతో దక్షిణ భారత్‌ ఆర్థికంగా ఎంతో రక్షణ కలిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత పశి్చమ భారత్‌ 42 పాయింట్ల నుంచి 46 పాయింట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పట్టణ ప్రజల ఆర్థిక రక్షణ స్థాయిలను లెక్కించేందుకు ఐపీక్యూ అచ్చమైన కొలమానంగా మారినట్టు మ్యాక్స్‌లైఫ్‌ ఎండీ, సీఈవో ప్రశాంత్‌ త్రిపాఠి అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement