
మీకు తెలుసా..
బంగారం(Gold) కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బంగారం నాణ్యతను గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం(24 karat gold) అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్(Biscuit) రూపంలోనే ఉంటుంది.
22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి.
18 క్యారెట్లు: 75 శాతం బంగారం, మిగతా 25 శాతం ఇతర లోహాలు14 క్యారెట్లు: 58.5శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహాలు
12క్యారెట్లు: 50 శాతం మాత్రమే బంగారం, మిగతా 50 శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.
10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.
బంగారం ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్జరింగ్ చేయడాన్ని కేడీఎం అంటారు. ఇవి 91.6 నాణ్యతతో ఉంటాయి.
ఆభరణం చిన్నదైనా, పెద్దదైనా హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తోపాటు ఆ వస్తువు సరి్టపై చేసిన హాల్‌మార్క్ సెంటర్ వివరాలు తెలిపే హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ యూనిక్ ఐడీ నంబరు విధిగా ఉండాలి.
ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది.
షాకింగ్ ధరలు: ఎగిసిన బంగారం.. దూసుకెళ్లిన వెండి!