
న్యూఢిల్లీ: బహమాస్‌కి చెందిన స్టెర్లింగ్ బ్యాంకులో మిగతా 49 శాతం వాటాలను దక్కించుకున్నట్లు ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్) మారిషస్ వెల్లడించింది. దీనితో బ్యాంకు కొనుగోలు పూర్తయినట్లు వివరించింది.
2022 సెప్టెంబర్‌లో బ్యాంకులో 51 శాతం వాటాను ఐఐహెచ్‌ఎల్ మారిషస్ కొనుగోలు చేసింది. బ్యాంకు పేరును ’ఐఐహెచ్‌ఎల్ బ్యాంక్ అండ్ ట్రస్టు’ గా మార్చనున్నట్లు సంస్థ తెలిపింది. బ్యాంకింగ్, బీమా తదితర ఆర్ధిక సేవలందించే ఐఐహెచ్‌ఎల్ నికర విలువ 1.26 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో అయిదో పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఇండస్‌ఇండ్ బ్యాంక్‌నకు ఐఐహెచ్‌ఎల్ ప్రమోటరుగా ఉంది.