ఆ కస్టమర్లకు షాక్‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌ కీలక నిర్ణయం!

Icici Bank Stock To Customers, Hike Service Charges Nri Savings Accounts - Sakshi

దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది.
 

ఏవేవి పెరిగాయి..
ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్‌మెంట్ జారీ, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, IMPS అవుట్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్‌వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి.

బ్యాంక్ జరిమానా ఛార్జీలు
 చెక్ రిటర్న్ అవుట్‌వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్‌వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్)  వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది.

చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్‌ చేయకండి, మోసపోతారు జాగ్రత్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top