
దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం 'ఐసీఐసీఐ' (ICICI) సంచలన నిర్ణయం తీసుకుంది. మినిమమ్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంచుతూ కీలక సవరణ చేసింది. 2025 ఆగస్టు 1 అమలులోకి వచ్చేలా.. సేవింగ్స్ ఖాతాలకు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB)ను గణనీయంగా పెంచుతున్నట్లు పేర్కొంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం.. మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు మినిమం బ్యాలెన్స్ రూ. 50,000 నిర్వహించాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ. 10,000గా ఉండేది.

సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు బ్యాలెన్స్ రూ. 5000 నుంచి రూ. 25వేలకు పెరిగింది. గ్రామీణ ఖాతాలను రూ. 2500 నుంచి రూ. 10,000కు పెంచింది. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోకపోతే.. భారీ జరిమానాలు చెల్లించాల్సిందే. ఇదే బాటలో ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా అడుగులు వేస్తే.. ఖాతాదారులు తమ ఖాతాల్లో వేల రూపాయలు ఉంచుకోక తప్పదు.