హైదరాబాద్ కంపెనీ రూ.1,300 కోట్ల డీల్‌ | Hyderabad Sai Parenterals Rs 1300 crore australia pharma deal | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కంపెనీ రూ.1,300 కోట్ల డీల్‌

Jul 2 2026 9:13 PM | Updated on Jul 2 2026 9:54 PM

Hyderabad Sai Parenterals Rs 1300 crore australia pharma deal

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫార్మసీ చెయిన్‌కి ఔషధాలు సరఫరా చేసే దిశగా తమ అనుబంధ సంస్థ నూమెడ్‌ ఫార్మా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు సాయి పేరెంటరల్స్‌ వెల్లడించింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 1,300 కోట్లు ఉంటుందని తెలిపింది.

ఏడున్నరేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుందని, మరో మూడేళ్లు పొడిగించుకునే వీలుంటుందని వెల్లడించింది. ఏటా 12 కొత్త ప్రోడక్టులు జత అవుతుండటం వల్ల కాంట్రాక్టు విలువ, పరిధి పెరుగుతుందని వివరించింది. అంతర్జాతీయంగా ఫార్మా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని సాయి పేరెంటరల్స్‌ ఎండీ అనిల్‌ కుమార్‌ కరుసాల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement