వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ డౌన్‌

Hiring activity for white-collar jobs dips 12percent during Oct-Nov - Sakshi

అక్టోబర్‌–నవంబర్‌లో 12 శాతం తగ్గిన నియామకాలు

నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదికలో వెల్లడి

ముంబై: ఐటీ–సాఫ్ట్‌వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్‌–నవంబర్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు హైరింగ్‌ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్‌–నవంబర్‌లో 2,781 జాబ్‌ పోస్టింగ్స్‌ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్‌ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్‌కామ్‌లో సంస్థలు పోస్ట్‌ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్‌ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్‌ కాలర్‌ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు.

నివేదికలోని మరిన్ని విశేషాలు..
► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్‌ రంగంలో 11 శాతం మేర వైట్‌ కాలర్‌ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు.
►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్‌ రంగాల్లో హైరింగ్‌ 9 శాతం పెరిగింది.
►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి.  
►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్‌ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి.
►ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ సంబంధ మెషిన్‌ లెరి్నంగ్‌ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర,  ఫుల్‌ స్టాక్‌ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి.  
►మెట్రోలతో పోలిస్తే నాన్‌–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్‌ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్‌ నమోదయ్యాయి.
►ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్‌ క్షీణించింది.
►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్‌కి అనుగుణంగా అక్టోబర్‌–నవంబర్‌లో కూడా సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్‌ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top