Govt hikes small savings interest rates, others remain unchanged; check here - Sakshi
Sakshi News home page

పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!

Jul 1 2023 12:25 PM | Updated on Jul 1 2023 12:54 PM

Govt hikes small savings interest ratesothers remain unchanged Check here - Sakshi

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. జూలై 1 నుంచి మొదలయ్యే మూడు నెలల కాలానికి తాజా రేట్లను ప్రకటించింది. కొన్నింటి పథకాల రేట్లను 0.3 శాతం వరకు పెంచగా, చాలా పథకాల్లో రేట్లను యథాతథంగా కొనసాగించింది.  

♦ ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ)పై ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న రేటు పెంపు అనంతరం 6.5 శాతంగా మారింది. 
♦  ఏడాది కాల టర్మ్‌ డిపాజిట్‌పై 0.1 శాతం పెరిగి 6.9 శాతానికి, రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది
♦ మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌ (7శాతం), ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్‌ (7.5శాతం) రేట్లలో మార్పు చేయలేదు.  
♦  అలాగే పీపీఎఫ్‌ వడ్డీ రేటు సైతం ఎలాంటి మార్పుల్లేకుండా 7.1 శాతంగా, సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు 4 శాతంగా కొనసాగనుంది.  
♦  నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) రేటు 7.7 శాతం, సుకన్య సమృద్ధి యోజన రేటు 8 శాతంలోనూ మార్పు చేయలేదు. 
♦  సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 8.2శాతం, కిసా న్‌ వికాస్‌ పత్రం రేటు 7.5 శాతం కొనసాగనుంది. 
♦  నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌) రేటు 7.4 శాతంగా కొనసాగుతుంది. 

పెంపు ఆగినట్టేనా?  
జనవరి-మార్చి, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి  పొదుపు పథకాలపై రేట్లను పెంచింది. దీంతో ఈ విడత కేవలం 3 పథకాలు మినహా మిగిలిన వాటి రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ సైతం గత సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను మార్చలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement