పుణెలో గూగుల్‌ కొత్త ఆఫీస్‌.. ఎలా ఉందో చూడండి..

Googles Newly Opened Office In Pune Employee Gives A Tour video - Sakshi

Google New Office In Pune : భారత్‌లో విస్తరణను కొనసాగిస్తున్న టెక్‌ దిగ్గజం గూగుల్‌ ( Google ) ఇటీవల పుణెలోని కోరేగావ్ పార్క్ అనెక్స్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా గ్లోబల్ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో అధునాతన ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ టెక్నాలజీల రూపకల్పన, రియల్‌ టైమ్‌లో సాంకేతిక సలహాలను అందించడం, ప్రొడక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ నైపుణ్యాలను అందిస్తారు. ఇక్కడ 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని అంచనా.

పుణెలోని గూగుల్‌ కొత్త ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అర్ష్ గోయల్.. అక్కడ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు సౌకర్యాల గురించి తెలియజేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. విశాలమైన ఆఫీస్‌లో అందమైన ఇంటీరియర్స్ తోపాటు నోరూరించే ఆహారంతో కేఫ్‌, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ''పుణెలో కొత్తగా ప్రారంభించిన గూగుల్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల రోజు ఎలా ఉంటుందో చూడండి'' అంటూ తన ఫోలోవర్లతో వీడియోను పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్‌ చేసినప్పటి నుంచి 4,70,000 కుపైగా వీవ్స్‌, 18,000 కుపైగా లైక్‌లను పొందింది. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్‌ కొత్త ఆఫీస్‌ ఇష్టపడ్డారు.అక్కడ పని చేయడానికి తాము ఇష్టపడుతున్నట్లు కామెంట్లు పెట్టారు. పుణెలో ఏర్పాటైన ఈ కొత్త ఆఫీస్‌తో గూగుల్‌కి ఇప్పుడు భారత్‌లో హైదరాబాద్‌లోని తన దేశ ప్రధాన కార్యాలయంతో సహా ఐదు కార్యాలయాలు ఉన్నాయి.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top