టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్! | Google To Roll Out SoundPod Audio Devices In India | Sakshi
Sakshi News home page

టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్!

Feb 23 2024 7:34 AM | Updated on Feb 23 2024 9:31 AM

Google To Roll Out Soundpod Audio Devices In India - Sakshi

ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు గూగుల్ భారీ షాకిచ్చింది. త్వరలో భారత్‌లో మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఆడియో అలర్ట్‌లతో క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు జరిపేందుకు గాను స్పీకర్ సౌండ్ పాడ్స్(SoundPods)ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది  

దేశంలో పేటీఎం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పేటీఎం యూజర్లు ఇతర యూపీఐ పేమెంట్స్, చిరు వ్యాపారులు సౌండ్‌బాక్స్‌ల‌ను వినియోగిస్తున్నారు.

తరుణంలో గూగుల్ గత ఏడాది తన సౌండ్‌బాక్స్‌ల‌ను పరిమిత యూజర్లకు అందించింది. బాక్స్ పనితీరు ఎలా ఉంది? లావా దేవీలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై వ్యాపారుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. గూగుల్ విడుదల చేసిన సౌండ్ బాక్స్ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సౌండ్ బాక్స్ లను వినియోగంలోకి తెస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషలలో ఆడియో అలెర్ట్ లను అందించే గూగుల్ సౌండ్ పాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారి లేదంటే,ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు.  

రోజువారీ ప్లాన్‌లో, వ్యాపారులు వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ కింద రూ. 499 చెల్లించాలి. ఆ తర్వాత వారి సెటిల్‌మెంట్ ఖాతా నుండి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్‌లో వ్యాపారి సెటిల్‌మెంట్ అకౌంట్ నుండి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ తెలిపింది. 

గూగుల్ తన సొంత క్యూ ఆర్ కోడ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్ పే క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలలో రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ. 125 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement