అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా? | Good Bye Reynolds Favorite Pen Is Reportedly Discontinued - Sakshi
Sakshi News home page

అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?

Aug 25 2023 3:19 PM | Updated on Aug 25 2023 3:56 PM

Good bye Reynolds Favorite Pen Is Reportedly Discontinued - Sakshi

Reynolds 045 Fine Carbure  భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన  బాల్‌ పెన్ రేనాల్డ్స్. 90వ దశకంలో రేనాల్డ్స్ పెన్స్ బ్రాండ్ ఒక ట్రెండ్‌ సృష్టించింది. బ్లూ క్యాప్‌, వైట్ కలర్ బాడీతో మొదలై పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పవచ్చవు. 90వ దశకంలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు, ఉద్యోగస్తుల వరకూ అలనాటి పెన్స్‌ పరిచయం లేనివారెవ్వరూ ఉంటారు.  రేనాల్డ్స్ పేరుతో  వచ్చిన ఉత్పత్తులలో బాల్ పాయింట్, జెల్, రోలర్‌బాల్ , ఫౌంటెన్ పెన్నులు , మెకానికల్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇపుడా  రేనాల్డ్స్ పెన్ ఇప్పుడు మార్కెట్‌లో మాయమైపోతోందట. ఈ మేరకు  పలు కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా స్పందించారు.

రెనాల్డ్స్ పెన్.. అంటే ఒక నోస్టాల్జియా. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా అలా మదిలో మెదులుతాయి. ఇపుడా రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారనేవార్త దావానంలా వ్యాపించింది. కేవలం 5 రూపాయలకు లభించే ఈ పెన్ను దేశంలో బాగా పాపులర్‌ అయింది. ప్రధానంగా రీఫిల్  లీక్‌లకు చెక్‌ పెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా  వినియోగదారులను బాగా  ఆకట్టుకుంది. 

Reynolds 045 Fine Carbure పెన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంటూ @memorable_90s యూజర్ చేసిన ట్విటర్‌ పోస్ట్  వైరల్‌ అయింది. ఈ ప్రత్యేక బ్రాండ్ రేనాల్డ్స్ మిలీనియల్స్‌లో కల్ట్ ఫాలోయింగ్‌. ఎరుపు, నలుపు, నీలం రంగులలో వచ్చిన క్లాసిక్.ఖరీదైన 'పైలట్' పెన్నులతో పోల్చినప్పుడు  సామాన్యులకు  ఈజీగా అందుబాటులో వచ్చాయి. దీంతో తమకు ఇష్టమైన కలం ఉత్పత్తి ఆగి పోయిందనే విషాద వార్తపై నెటిజన్లు స్పందించారు. తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఈపెన్‌ వాడు తున్నామంటూ కొందరు పేర్కొన్నారు. రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్‌ని ది నేషనల్‌ పెన్‌ ఆఫ్‌  ఇండియా అంటూ ఒకరు కమెంట్‌  చేశారు.  పెన్ బెస్ట్ సెల్లర్‌గా ఎలా అమ్ముడయ్యిందో చెబుతూ మరొక యూజర్‌ ట్వీట్‌ చేశారు. 'చౌక, గొప్ప, మన్నికైన , ఫాడూ పెన్‌గా అభవర్ణించారు. అయితే ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉందంటూ  మరికొందరు సూచించారు. అయితే ఇది ఫేక్‌  న్యూస్‌ అంట ఒక యూజర్‌ ఒకప్రకటనను  షేర్‌ చేశారు. 


అసలు నిజం ఏమిటంటే
వివిధ మీడియాలో ప్రచురించిన తప్పుడు సమాచారంపై రెనాల్డ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం కోసం తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్స్‌ను పరిశీలించాలని కోరింది. రేనాల్డ్స్‌కు భారతదేశంలో 45 ఏళ్ల వారసత్వం  ఉంది దాన్ని కొనసాగిస్తాం. దేశంలో రైటింగ్ బిజినెస్‌ను వృద్ధి చేయాలనే దృక్పథంతో ఉన్నామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement