breaking news
Reynolds
-
అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?
Reynolds 045 Fine Carbure భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాల్ పెన్ రేనాల్డ్స్. 90వ దశకంలో రేనాల్డ్స్ పెన్స్ బ్రాండ్ ఒక ట్రెండ్ సృష్టించింది. బ్లూ క్యాప్, వైట్ కలర్ బాడీతో మొదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చవు. 90వ దశకంలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు, ఉద్యోగస్తుల వరకూ అలనాటి పెన్స్ పరిచయం లేనివారెవ్వరూ ఉంటారు. రేనాల్డ్స్ పేరుతో వచ్చిన ఉత్పత్తులలో బాల్ పాయింట్, జెల్, రోలర్‌బాల్ , ఫౌంటెన్ పెన్నులు , మెకానికల్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇపుడా రేనాల్డ్స్ పెన్ ఇప్పుడు మార్కెట్లో మాయమైపోతోందట. ఈ మేరకు పలు కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా స్పందించారు. రెనాల్డ్స్ పెన్.. అంటే ఒక నోస్టాల్జియా. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా అలా మదిలో మెదులుతాయి. ఇపుడా రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారనేవార్త దావానంలా వ్యాపించింది. కేవలం 5 రూపాయలకు లభించే ఈ పెన్ను దేశంలో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా రీఫిల్ లీక్‌లకు చెక్ పెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. Reynolds 045 Fine Carbure పెన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంటూ @memorable_90s యూజర్ చేసిన ట్విటర్ పోస్ట్ వైరల్ అయింది. ఈ ప్రత్యేక బ్రాండ్ రేనాల్డ్స్ మిలీనియల్స్‌లో కల్ట్ ఫాలోయింగ్. ఎరుపు, నలుపు, నీలం రంగులలో వచ్చిన క్లాసిక్.ఖరీదైన 'పైలట్' పెన్నులతో పోల్చినప్పుడు సామాన్యులకు ఈజీగా అందుబాటులో వచ్చాయి. దీంతో తమకు ఇష్టమైన కలం ఉత్పత్తి ఆగి పోయిందనే విషాద వార్తపై నెటిజన్లు స్పందించారు. తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఈపెన్ వాడు తున్నామంటూ కొందరు పేర్కొన్నారు. రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ని ది నేషనల్ పెన్ ఆఫ్ ఇండియా అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెన్ బెస్ట్ సెల్లర్‌గా ఎలా అమ్ముడయ్యిందో చెబుతూ మరొక యూజర్ ట్వీట్ చేశారు. 'చౌక, గొప్ప, మన్నికైన , ఫాడూ పెన్‌గా అభవర్ణించారు. అయితే ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉందంటూ మరికొందరు సూచించారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అంట ఒక యూజర్ ఒకప్రకటనను షేర్ చేశారు. అసలు నిజం ఏమిటంటే వివిధ మీడియాలో ప్రచురించిన తప్పుడు సమాచారంపై రెనాల్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం కోసం తమ వెబ్సైట్, సోషల్ మీడియా ఛానెల్స్‌ను పరిశీలించాలని కోరింది. రేనాల్డ్స్కు భారతదేశంలో 45 ఏళ్ల వారసత్వం ఉంది దాన్ని కొనసాగిస్తాం. దేశంలో రైటింగ్ బిజినెస్‌ను వృద్ధి చేయాలనే దృక్పథంతో ఉన్నామని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by Reynolds (@originalreynoldsindia) I still use the same..ordered 15 of these for my office. I think they will be the last ones now. pic.twitter.com/jdy0wrHVZx — A.K (@HaddHaiYaar) August 24, 2023 Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 pic.twitter.com/pSU4WoB5gt — 90skid (@memorable_90s) August 24, 2023 what 😭😭😭😭 I use this pen for all of my artworks , bro 😰😢😢😢 pic.twitter.com/LrkABExkWM — Tales, Legends & Stories ♪ (@byindianwriters) August 24, 2023 -
ప్రపంచ టొబాకో రంగంలో భారీ డీల్!
• బీఏటీ చేతికి రేనాల్డ్స్ అమెరికన్ • 49.4 బిలియన్ డాలర్ల ఒప్పందం లండన్: ప్రపంచ టొబాకో పరిశ్రమలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా దిగ్గజం రేనాల్డ్స్ అమెరికన్‌ను చేజిక్కించుకున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం 49.4 బిలియన్ డాలర్లను(దాదాపు రూ.3.35 లక్షల కోట్లు) వెచ్చించేందుకు అంగీకరించింది. ఈ డీల్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో(సిగరెట్లు ఇతరత్రా పొగాకు ఉత్పత్తులు) కంపెనీ ఆవిర్భవిస్తోందని బీఏటీ పేర్కొంది. నగదు, షేర్ల రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని తెలిపింది. గతంలో ఆఫర్ చేసిన 47 బిలియన్ డాలర్ల మొత్తాన్ని రేనాల్డ్స్ అమెరికన్ తిరస్కరించడంతో డీల్ విలువను బీఏటీ పెంచింది. తాజా డీల్ ప్రకారం రేనాల్డ్స్ వాటాదారులు తమ ఒక్కో షేరుకు 29.44 డాలర్ల నగదును, 0.5260 బ్యాట్ సాధారణ షేర్లను అందుకుంటారు. మొత్తంమీద ఈ ఆఫర్ కింద బీఏటీ 25 బిలియన్ డాలర్ల నగదు, 24.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను రేనాల్డ్స్ వాటాదారులకు ఇస్తోంది. దీంతో రేనాల్డ్స్ గ్రూప్ విలువ 85 బిలియన్ డాలర్లకు పైగానే లెక్కతేలుతోంది. ఏకమవుతున్న గ్లోబల్ బ్రాండ్స్... బీఏటీ, రేనాల్డ్స్ డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా పేర్కొందిన టొబాకో బ్రాండ్లు ఒకే గూటికి చేరనున్నాయి. ఇందులో బ్యాట్ ఉత్పత్తులైన లక్కీ స్ట్రైక్, రోత్‌మన్స్, కెంట్... రేనాల్డ్స్ బ్రాండ్లు న్యూపోర్ట్, కేమెల్, పాల్మాల్ ఉన్నాయి. కొనుగోలు తర్వాత ఆవిర్భవించే కంపెనీకి అమెరికాలో పటిష్టమైన మార్కెట్‌తో పాటు భారీగా వృద్ధి అవకాశాలున్న దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో గణనీయమైన మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. ‘‘రేనాల్డ్స్‌తో ఒప్పందం కుదరడం చాలా ఆనందంగా ఉంది. ఈ–సిగరెట్స్ లేదా వ్యాపింగ్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న కొత్త తరం ఉత్పత్తులకు సంబంధించి సిసలైన ప్రపంచ వ్యాపారాన్ని సృష్టించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుంది’ అని బీఏటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నికాండ్రో డ్యురాంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ వాటా ప్రకారం చూస్తే చైనా నేషనల్ టొబాకో కార్పొరేషన్ ప్రపంచంలో అతిపెద్ద సిగరెట్ ఉత్పత్తిదారుగా నిలుస్తోంది. తర్వాత స్థానంలో మాల్బ్రో బ్రాండ్ తయారీ కంపెనీ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ ఉంది. అయితే, రేనాల్డ్స్ కొనుగోలుతో నికర టర్నోవర్, నిర్వహణ లాభం పరంగా తమదే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో కంపెనీగా ఆవిర్భవిస్తుందని బీఏటీ చెబుతోంది.