బంగారం, వెండిపై సీఎంఆర్‌ జ్యువెలరీలో దీపావళి ఆఫర్లు | Gold Silver Diamond Discounts CMR Jewellery Diwali Dhamaka Offers 2026 | Sakshi
Sakshi News home page

బంగారం, వెండిపై సీఎంఆర్‌ జ్యువెలరీలో దీపావళి ఆఫర్లు

Nov 5 2026 6:59 PM | Updated on Nov 5 2026 7:01 PM

Gold Silver Diamond Discounts CMR Jewellery Diwali Dhamaka Offers 2026

దీపావళి పండుగ సందర్భంగా సీఎంఆర్‌ జ్యువెలరీ బంగారం, వెండిపై దీపావళి ధమాకా ఆఫర్లు ప్రకటించింది. అర్హత కలిగిన అన్ని 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపైనా వాల్యూ అడిషన్ (V.A.)కు ఫ్లాట్ 7.99 శాతం ఆఫర్ అందిస్తోంది. గాజులు, హారాలు, చెవి కమ్మలు, ఉంగరాలు, సంప్రదాయ ఆభరణాలు… కొనుగోలుదారులు తమ అభిరుచికి తగిన అందమైన డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీఏపై బ్రాంచ్‌లవారీగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. గాజువాక బ్రాంచ్‌లో వీఏపై ఫ్లాట్ 5.99 శాతం, మియాపూర్ బ్రాంచ్‌లో 6.99 శాతం, మిగిలిన బ్రాంచ్‌లలో ఫ్లాట్ 7.99 శాతం ఆఫర్‌ను సీఎంఆర్‌ జ్యువెలరీ అందిస్తోంది.

అదేవిధంగా కొనుగోలుదారుల దగ్గర ఉన్న పాత బంగారం ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.200 ప్రయోజనం అందిస్తోంది. వెండి కొనుగోలుదారుల కోసం కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గాజువాకలో కిలోకు రూ.5,999 డిస్కౌంట్ అందిస్తుండగా మిగిలిన బ్రాంచ్‌లలో కిలోకు రూ.6,666 డిస్కౌంట్ అందిస్తోంది.

ఇక వజ్రాల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. జేసీ, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, గాజువాక, గోపాలపట్నం, విజయనగరం, రాజాం, శ్రీకాకుళం, నర్సీపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, తిరుపతి, కొత్తగూడెం, మియాపూర్ బ్రాంచ్‌లలో ఈ ఆఫర్లు  అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు ఆఫర్లు వర్తిస్తాయి.







 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement