రూ. లక్షన్నర దిగువకు పసిడి | Gold prices in Delhi fell Rs 1400 to Rs 148600 per 10 grams | Sakshi
Sakshi News home page

రూ. లక్షన్నర దిగువకు పసిడి

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

Gold prices in Delhi fell Rs 1400 to Rs 148600 per 10 grams

న్యూఢిల్లీ: అమెరికా డాలర్‌ బలోపేతం కావడం, స్థానికంగా డిమాండ్‌ మందగించడంతో దేశ రాజధానిలో పసిడి ధర రెండు నెలల తర్వాత మళ్లీ రూ.1.50 లక్షల దిగువకు దిగొచ్చింది. మంగళవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర మరో రూ.1,400 తగ్గి రూ.1,48,600కు చేరింది.

ఈ ఏడాది జూలై 31 (రూ.1,48,300) తర్వాత పసిడి మళ్లీ ఈ కనిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మరోవైపు, కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2.32 లక్షల వద్దే స్థిరంగా ముగిసింది. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఏడు వారాల కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయింది. స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 30.34 డాలర్లు (సుమారు ఒక శాతం) పెరిగి 4,145.26 డాలర్లకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement