ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు

Gold price coming down On Stronger Dollar Check details - Sakshi

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఇటీవలి ఆకాశాన్నంటిన పసిడి ధరతో బెంబేలెత్తిన కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత బులియన్ మార్కెట్లో ఈ రోజు (గురువారం) బంగారం ధర క్షీణించగా, వెండి  కూడా అదే బాటలో ఉంది. (వాట్సాప్‌ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్‌: ఒకేసారి 32 మందితో)

రాయిటర్స్ నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్  వ్యాఖ్యలు బులియన్‌  మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.  ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో  10 గ్రాముల బంగారం ధర రూ.59,050కి తగ్గింది. కిలో వెండి  రూ. 350 తగ్గి  71,250కి వద్ద ఉంది గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.59,350 వద్ద ముగిసింది. (థ్యాంక్స్‌ టూ యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌, లేదంటే నా ప్రాణాలు: వైరల్‌ స్టోరీ)

ఇక హైదరాబాద్‌లో  24 ‍ క్యారెట్ల 10 గ్రా. ధర 210రూపాయలు  తగ్గి, 58,750  పలుకుతోంది.  22 ‍ క్యారెట్ల 10 గ్రా. ధర 200 రూపాయలు  తగ్గి, 53,850గా ఉంది. అలాగే  వెండి కిలో  రూ. 400  తగ్గి, 75,700గా ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top