ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్‌ | Gold and Silver rates today on market in Telugu states | Sakshi
Sakshi News home page

Today Gold Rate: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్‌

Nov 7 2024 11:49 AM | Updated on Nov 7 2024 3:15 PM

Gold and Silver rates today on market in Telugu states

అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడి పీఠం ఎక్కనున్నారు. ఇప్పటివరకు కొంత సేఫ్డ్‌ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నాట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు గురువారం యూటర్న్‌ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,000 (22 క్యారెట్స్), రూ.78,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1650, రూ.1790 తగ్గింది.

చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1790 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

ఇదీ చదవండి: ‘నవంబర్‌ 8న సెలవులో ఉంటాను.. బై’!

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1650 తగ్గి రూ.72,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1790 దిగజారి రూ.78,710 వద్దకు చేరింది.

సిల్వర్ ధరలు

బంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. బుధవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.3,000 తగ్గి రూ.1,02,000కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

కొండెక్కిన బంగారం ధరలు..

Advertisement
 
Advertisement
Advertisement