రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు | Global trends, foreign investors key drivers for markets this week | Sakshi
Sakshi News home page

రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు

Published Mon, Sep 23 2024 6:25 AM | Last Updated on Mon, Sep 23 2024 8:04 AM

Global trends, foreign investors key drivers for markets this week

నిఫ్టీ 26,000 అందుకునే ఛాన్స్‌ 

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కీలకం 

అంతర్జాతీయ పరిణామాలపైనా దృష్టి 

ఈ వారం ట్రేడింగ్‌పై స్టాక్‌ నిపుణుల అంచనా  

ముంబై: స్టాక్‌ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

‘‘ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్‌ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు.  

అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్‌ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. 

గురువారం డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు  
ఈ గురువారం (సెపె్టంబర్‌ 22న) నిఫ్టీ సెపె్టంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్‌ ఆఫ్‌ లేదా రోలోవర్‌ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్‌ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్‌ డేటా సూచిస్తోంది.

రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు  
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్‌ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్‌ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్‌ఎన్‌ హీట్‌ ఎక్సే్ఛంజర్‌ అండ్‌ రిఫ్రిజిరేషన్‌ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్‌ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్‌ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్‌ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్‌ క్యారియర్స్‌ ఇండియా, ఆర్కేడ్‌ డెవలపర్స్, నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్‌ 24న) స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.  

విదేశీ పెట్టుబడులు
ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్‌ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్‌లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్‌ వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వీకే విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం  
దేశీయంగా హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్‌ సెపె్టంబర్‌ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్‌ జపాన్‌ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్‌), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్‌ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్‌ నిల్వల డేటాను ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement