చాట్‌జీపీటీతో పనిచేసే టైప్‌ రైటర్‌ వచ్చేసిందోచ్‌!

Ghostwriter Is An Ai-powered Typewriter That Can Talk To You - Sakshi

టైప్‌ రైటర్‌తో పనిచేయాలంటే, మనకు టైపింగ్‌ రావాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న టైప్‌ రైటర్‌తో టైప్‌ చేయాలంటే, మనకు టైప్‌ రాకున్నా ఫర్వాలేదు. ఇది తనంతట తానే టైప్‌ చేసేస్తుంది. పూర్తిగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టైప్‌ రైటర్‌కు ‘చాట్‌ జీపీటీ’ ద్వారా సరిగ్గా మార్గనిర్దేశనం చేస్తే చాలు, మిగిలిన పనిని ఎలాంటి సాయం లేకుండా తానే పూర్తి చేస్తుంది.

ప్రస్తుతం కోపెన్‌హాగెన్‌లో స్థిరపడిన కేరళకు చెందిన డిజైనింగ్‌ నిపుణుడు, ఇంజనీర్‌ అరవింద్‌ సంజీవ్‌ ఈ టైప్‌ రైటర్‌కు రూపకల్పన చేశారు. విలక్షణంగా పనిచేసే ఈ టైప్‌ రైటర్‌కు దీని పనికి తగినట్లే ‘ఘోస్ట్‌ రైటర్‌’ అని పేరు పెట్టడం విశేషం. ఓఎల్‌ఈడీ స్క్రీన్, రెండు నాబ్స్, తేలికగా వాడుకునేందుకు వీలయ్యే కీబోర్డ్‌ ఈ టైప్‌రైటర్‌కు ప్రత్యేక ఆకర్షణలు. దీనిని ఇంకా మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top