
గూగుల్ ఇటీవల జెమిని యాప్‌లో నానో బనానా అనే కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన నెల రోజుల్లో ఏకంగా 500 కోట్ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసింది. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.
500 కోట్ల చిత్రాలు పూర్తయ్యాయి. ఆ తరువాత ఫోటో నాదే అంటూ 'సుందర్ పిచాయ్' నానో బననా ఫోటో షేర్ చేశారు. ఒక్క నెలలో 500 కోట్ల ఫోటోలు అంటే.. దీనికున్న ఆదరణ అంతాఇంతా కాదు.
నానో బనానా ఫీచర్ ద్వారా.. యూజర్లు రెట్రో చిత్రాలు, నవరాత్రి లుక్స్ వంటివాటిని సృష్టిస్తున్నారు. నానో బనానా రూపొందించే ఏఐ 3డీ చిత్రాలు నిజమైనవి కాదు. ఇవి కేవలం డిజిటల్ ఇమేజస్ మాత్రమే. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల.. ఎవరైనా తమ ఫ్యూతోను కూడా 3డీగా చేసుకోవాలని ఆశపడతారు. ఈ కారణంగానే.. ఎక్కువమంది దీనిని ఉపయోగించారు.
Make that 5 billion and 1 😂 https://t.co/3HDKDY3T0F pic.twitter.com/EQin9fpZuE
— Sundar Pichai (@sundarpichai) September 24, 2025