ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా పవర్ సిస్టమ్స్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.228)తో పోలిస్తే బీఎస్‌ఈలో 4% డిస్కౌంటుతో రూ.218 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% క్షీణించి రూ.205 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 9% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.6,384 కోట్లుగా ఉంది.


