ముంబై: బ్రోకరేజీ దిగ్గజం ‘గ్రో’ మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు లిస్టింగ్‌లో మెప్పించింది. ఇష్యూ ధర(రూ.100)తో పోలిస్తే బీఎస్‌ఈలో 14% ప్రీమియంతో రూ.114 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఈ షేరుకు మరింత డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 34% ఎగసి రూ.134 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 31% లాభంతో రూ.131 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.80,837 కోట్లుగా నమోదైంది.


