
భారత జీడీపీకి పర్యాటక రంగం రూ.20 లక్షల కోట్లు సమకూరుస్తున్నట్టు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ఏటా 25 శాతానికి మించి వృద్ధి చెందుతూ, 8.4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగాన్ని అనుబంధ పరిశ్రమగా కాకుండా జాతీయ ప్రాధాన్యంగా చూస్తున్నట్టు పేర్కొన్నారు.
భోపాల్‌లో నిర్వహించిన ‘ఎంపీ ట్రావెల్ మార్ట్’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘గతేడాది 2 కోట్ల మంది పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. దేశీ ట్రావెలర్ల ద్వారా 294 కోట్ల పర్యటనలు చోటుచేసుకున్నాయి. ఈ రంగం ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధిని (సీఏజీఆర్) నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం’’అని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా