పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ French Woman Sues Employer for 20 Year Salary Without Work Check The Full Details. Sakshi
Sakshi News home page

పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ

Published Fri, Jun 21 2024 9:44 PM | Last Updated on Sat, Jun 22 2024 9:04 AM

French Woman Sues Employer for 20 Year Salary Without Work Check The Full Details

ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్రాన్స్‌కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్‌హోవ్‌ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.

ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్‌హోవ్‌కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్‌ప్లేస్‌ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.

ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్‌హోవ్‌ పేర్కొన్నారు.

ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్‌హోవ్‌కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.

వాసెన్‌హోవ్‌ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్‌కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్‌లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement