
ఐటీ అధికారులకు మంత్రి సీతారామన్ సూచన
న్యూఢిల్లీ: విధానాలను సకాలంలో అమలు చేయడం ద్వారా కొత్త ప్రమాణాలను సృష్టించాలని.. పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
ఆరు నెలల్లోనే కొత్త ఆదాయపన్ను చట్టం ముసాయిదాను రూపొందించడం పట్ల అధికారులను అభినందించారు. ‘‘మంచి విధానాలు ఉండడంతోనే సరిపో దు. సకాలంలో వాటిని అమ లు చేయడమే కీలకం. ఇటీవలి కాలంలో మీరు ఎంతో గొప్ప గా పనిచేశారు. ఈ ప్రమాణాలను మరింత పెంచాల్సిన సమయం వచి్చంది’’అని 166వ ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భగా పేర్కొన్నారు.